27
దైవ స్తుతి
రా - బిలహరి, తా - త్రిపుట
కలుగునుగాక దేవునికి మహిమ - కలుగును గాక = కలుగు నున్నత మైన - ఘన స్థలములందున - నిలకు సమాధానం - నరుల కాయన దయ
1.ప్రభువైన దేవా - పరమరాజా - సర్వపరిపాలా = పరిపూర్ణ శక్తిగల - పరమ జనక నిన్ను - మహిని స్తుతించుచు - మరి పొగడుచున్నాము ||కలుగు||
2.మహిమపర్చుచు - ఆరాధించు చున్నాము నిన్ను = మహిమాతిశయమును మది దలంచియు నీకు - మహిని మా స్తుతి కృత - జ్ఞత నిచ్చుచున్నాము ||కలుగు||
*3.ఏక కుమారా - యేసు ప్రభువా - యెహోవా తనయా = లోక పాపము మోయు - ఏక దేవుని గొట్టె పిల్ల మమ్మును కనిక - రించుము చల్లగ ||గలుగు||
*4.లోకపాపములు - మోయుచు బోవు - యేసు రక్షకా = వాసిగ జనకుని కుడివైపున గూర్చుండు - యేసూ మా ప్రార్ధన నా - లించి కనికరించు ||కలుగు||
5.పరిశుద్ధుడవు - ప్రభుడవు నీవో - ప్రభువైన క్రీస్తూ = పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవుని యందు - బరి పూర్ణ మహిమతో బ్రబలుచున్నా మిపుడు ఆమెన్..||కలుగు||
- ఏర్పుల మోషే
______________________________
*ఈ గుర్తు గల చరణములు దీన స్వరముతో పాడదగును
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment