Evaruleka Ontarinai Andariki | ఎవరూ లేక ఒంటరినై

ఎవరూ లేక ఒంటరినై - అందరికి నే దూరమై (2) అనాధగా నిలిచాను - 
రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా (2)

1. స్నేహితులను నమ్మాను మోసం చేసారు - బంధువులను నమ్మాను ద్రోహం చేసారు (2)
దీనుడనై అంధుడనై - అనాధగా నే నిలిచాను (2) 
                                                             ||ఎవరు||
1. నేనున్నాను నేనున్నాని అందరు అంటారు - కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2) 
దీనుడనై అంధుడనై - అనాధగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4)                   ||ఎవరు||
 
2. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి - శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)
దీనుడనై అంధుడనై అనాధగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4)                    ||ఎవరు||

No comments: