Devuniki sthothramu gaanamu | దేవునికి స్తోత్రము గానము

657
దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము - చేయుటయే మంచిది ||దేవునికి||

1.యెరుషలేము యెహోవాయే - కట్టుచున్నవాడని (2)
ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||

2.గుండె చెదరిన వారిని - బాగుచేయువాడని
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని ||దేవునికి||

3.నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించును 
 వాటికన్నియు పేరులు - పెట్టుచున్నవాడని ||దేవునికి||

4.ప్రభువు గొప్పవాడును - అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని ||దేవునికి||

5.దీనులకు అండాయనే - భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని - స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||

6.ఆయన ఆకాశమున్ - మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము - సిద్ధపర్చువాడని ||దేవునికి||

7.పర్వతములలో గడ్డిని - పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును - ఆహారముతానీయును ||దేవునికి||

8.గుర్రముల నరులందలి - బలము నానందించడు
కృపకు వేడు వారిలో - సంతసించువాడని ||దేవునికి||

9.యెరూషలేము యెహోవాను - సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము - ఆనందించువాడని ||దేవునికి||

10.పిల్లల నాశీర్వదించియు - బలపరుచు నీగుమ్మముల్
మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి||

11.భూమికి తనయాజ్ఞను - ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును ||దేవునికి||

12.వాక్యమును యాకోబుకు- తెలియచేసినవాడని
ఏ జనము కీలాగున చేసి యుండ లేదని ||దేవునికి||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: