314
దావీదు కీర్తన 51
రా - శంకరాభరణం, తా - ఏక
1.ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి - మాన్యు జేయవె తండ్రీ! ||దేవ||
2.నీకు కేవలంబు - నీకే విరోధముగ = ప్రాకొని నే ఘోర - పాపం బొనర్చితిని ||దేవ||
3.నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది = నా యెదను భారంబై నను ద్రుంచుచున్నది ||దేవ||
4.పాపంబులోనే యుు - ద్భవించినాడను = పాపంబులోనే గ ర్భము దాల్చినది తల్లి ||దేవ||
5.ఎదయందు సత్యంబే యెడగోరు చుందువు = హృదయమందున జ్ఞాన మొదవ జేతువు నాకు ||దేవ||
6. కలిగించు నాలో ని - ర్మల శుద్ధ హృదయంబు = నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున ||దేవ||
7.త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి - తీసివేయక నుంచు = మీ శుద్ధాత్మను నాలో ||దేవ||
8.నీ రక్షణానంద మో రక్షకా మరల = చేరదీసి యిచ్చి స్థిరపరచు నా మనసు ||దేవ||
9.కావవే కర్తార - క్తాపరాధమునుండి = కావు నే నుత్సాహ గానంబు జేసెద ||దేవ||
10.ప్రభువ నా నోరునిన్ ప్రస్తుతించుచు సదా = విభవముగ గొనియాడ విప్పు నా పెదవులను ||దేవ||
11.కోరువాడవు కావీ వారయ నర్పణలు = కోరిన నర్పింతు కోటి బలులు నీకు ||దేవ||
12.విఱిగిన మనసే నీ విలసిత యర్పణముు = అరయ నలిగిన హృదయ మతి ప్రియంబౌ నీకు ||దేవ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment