188
సిలువ ధ్యానము
రా- ముఖారి, తా - త్రిపుట
చూడరే క్రీస్తుని జూడరే - నాసఖులార - చూడరే క్రీస్తుని జూడరే = చూడరే నా ముక్తి పదవికి - రేడు యేదశ గూడినాడో ||చూడరే||
1.మించి పొంతి పిలాతు సత్య మొ - కించుకైన దలంప కక్కట - వంచనను గొట్టించి యూదుల - మంచితనమే కోరి యప్ప - గించెనా - మేలు గణించె నా = ఇతని గాంచి కాంచి భక్తులెట్లు స - హించిరో పరికించి మీరిది ||చూడరే||
2.మంటికిని నాకాశమునకును - మధ్యమున వ్రేలాడు చుండగ నంట గొట్టగ సిలువ మ్రాని - కప్పగించుట కొఱకు నిన్ను - గాంచెనా - యిది మది నెంచెనా = హా నాకంటనే నిటువంటి యాపద గంటి బ్రాణము లుండునే యిక ||చూడరే||
3.ఊటగా రక్తంబు కారుచు - నుండు బల్లెపు బ్రక్కపోటు - మాటి మాటికి జూడ దుఃఖము మరలునే తలమీద ముళ్ల కి - రీటమా - యితనికి - వాటమా - యూదులు - మోటులై బాహాటమున నీ - పాటులను గాటముగ జేసిరి||చూడరే||
- పురుషోత్తము చౌదరి
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment