Chirakala Snehithuda | చిరకాల స్నేహితుడా

చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా 
నాతోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా 
నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా 
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2) 

1. బంధువులు వెలివేసిన - వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల||

2. కష్టాలలో కన్నీళ్ళలో నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల||

3. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువస్నేహం - నా యేసు నీ స్నేహం (2)  ||చిరకాల||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: