Yesutho teeviganu | యేసుతో ఠీవిగాను

521
ఉత్సవ గానము
రా - యమునా కల్యాణి,  తా - చతురశ్ర ఏక

    యేసుతో ఠీవిగాను పోదమా! - అడ్డు గావచ్చు వైరి గెల్వను యుద్ధ నాదంబుతో బోదము ||యేసుతో||

1.రారాజు   సైన్యమందు చేరను - ఆ రాజు దివ్య సేవ చేయను -
యేను రాజు ముందుగా - ధ్వజము బట్టి నడుపగా - యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||

2.విశ్వాస కవచమును ధరించుచు - ఆరాజు ఆజ్ఞ మదిని నిల్పును -
అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై - యేసుతో ఠీవిగాను వెడలను||యేసుతో||

3.శోధనలు మనల చుట్టివచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా - 
భయములేదు మనకిక - ప్రభువుచెంత నుందుము - యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||

4.ఓ యువతి యువకులార చేరుడి - శ్రీ యేసురాజు వార్త చాటుడి -
లోకమంత యేకమై - యేసునాధు గొల్వను - సాధనం బెవరు నీవు నేనెగా ||యేసుతో||
- ఏ. సి. కన్సింగర్
- సి. డి. శుభామని
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: