422
మంచికాపరి
రా - కమాసు, తా - ఆది
(చాయ: కొనియాడఁదరమె)
యెహోవా నాకాపరి - యిక గొదు వేమి ||యెహోవ॥
1.పచ్చిక చోట్లలో - బండ జేయును నన్ను = స్వచ్ఛ జలముల కడకు - జక్కగా నడిపించు ||యెహోవ॥
2.ఆయన దయతో నా - యాయాసముల దీర్చి = న్యాయమార్గములందు - నను బట్టి నడిపించు ||యెహోవ॥
3.గాఢాంధకార మార్గమున నే దిరిగినను = గాఢంపు గృప తోడ గరుణించు నన్నెపుడు ||యెహోవ॥
4.నీవు తోడైయుండ - నిర్భయం బగు నాకు = కావవచ్చును దుడ్డు - కఱ్ఱయును దండంబు ||యెహోవ॥
5.నా శత్రువుల నడుమ - నాకు భోజన మొసగి = యాళ తీరంగ ద- లంటె నూనెను బోసి ||యెహోవ॥
6.నా గిన్నె నిండెను - నా బ్రతుకు దినములలో = బాగుగా నీదు కృ పాదయలు వెంటాడు ||యెహోవ॥
7.పరమానందముతోడ - ప్రభు సన్ని ధానమున = పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు ||యెహోవ॥
- మల్లెల సొలొమోను జార్జి
No comments:
Post a Comment