440
స్వసమర్పణము
రా - యాదుకులకంభోజి, తా - త్రిపుట
తనువు నా దిదిగో గై - కొనుమి యో ప్రభువా నీ - పనికి బ్రతిష్టించుమీ = దినములు క్షణములు - దీసికొని యవి నీదు - వినతిన్ బ్రవహింప జే - యను శక్తి నీయుమీ ||తనువు||
1.ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై - పని చేయ జేతు లివిగో = యనయంబు నీ విషయ - మై సొగసుగా జురుకు - దనముతో బరు గెత్త - వినయ పాదము లివిగో ||తనువు||
2.స్వర మిదిగో కొనుమీ - వరరాజ నిను గూర్చి - నిరతమ్ము పాడనిమ్ము = మరియు పెదవు లివిగో - మహనీయ మైన నీ - పరిశుద్ధ వార్తతో - బరి పూర్ణముగ నింపు ||తనువు||
3.వెండి పసిడి యివిగో - వీస మైనను నా కై - యుండ వలె నని కోరను = నిండైన నీ యిష్ట - నియమంబు చొప్పున - మెండుగ వాడ బరి - మితియౌ జ్ఞానం బిదిగో ||తనువు||
4.నా యిష్ట మిదిగో యిది - నీ యిష్టముగ జేయ - నా యిష్టమిక గాదది = నా యిచ్ఛ యున్నట్టి - నా హృదయ మిదిగో నీ - కే యియ్యది రాజ - కీయ సింహాసనమా ||తనువు||
5.ఉన్న నా ప్రేమ నీ - సన్ని ధానమున నే - నెన్నడు ధార వోయన్ - నన్ను నీ వానిగ - నాధా గైకొను మపుడు - చెన్నుగ నీ వశమై - స్థిరముగ నుండెద ||దనువు||
- ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment