Dikkuleni Vadano Prabho | దిక్కులేని వాడనో ప్రభో

316
పాపపు టోప్పుదల
రా - కేదారగౌళ,  తా - ఏక

దిక్కులేని వాడనో ప్రభో - నీ యండ జేరి - మ్రొక్కి సేవ జేతు నో ప్రభో = మ్రొక్కి విన్న వించు వారి - యక్కరలను దీర్చు సత్యము - గ్రక్కున నిడి యాదరించు - మక్కువైన దేవ తనయ ||దిక్కులేని||
 
1.ఘోరపాప భరము నెల్లను - మోయుచు నలయు -  వారలార రండ టంచును = దయను బిలిచియున్న - సార వాక్కు లెఱుగ కధిక - భారమొంది తుదిని నీదరి - జేరితి నన్నాదరించుము ||దిక్కులేని||
 
2.బలము లేనివాడ నో ప్రభో - కేవలము పాప - ములను జేసి యలసితిని ప్రభో = ఇలను నే నొనర్చునట్టి - కలుష జాలములను నీవు - తొలగ జేసి యాత్మ కధిక-బలము నొసగి మనుపుమయ్య ||దిక్కులేని||
 
3.పామరుండ నౌట వల్లను నే నెఱుగ నైతి - క్షేమ మిచ్చు పదవు లెల్లను = కామ క్రోధ లోభములను - దీమసమున విడిచి యేసు - నామ మందు విశ్వసించి - ప్రేమను వర్తింపజేయు ||దిక్కులేని||
 
4.వందనం బొనర్తు నో ప్రభో - నా డెందమందలి -   సందియము లణంచుమో ప్రభో = సందియ మెడ బాపి శాస్త్ర - మందు నుండు సార వాక్యా - నంద పదవులను భవింప - డెందము వెలిగింప వయ్య ||దిక్కులేని||
 - చిక్కాల పాలస్ 
DOWNLOAD MP3 SONG HERE 👇

1 comment:

Christian Tunes said...

https://teluguchristiantunes.blogspot.com/