11
దేవుని వైపు చూచుట
రా - కమాసు, తా – త్రిపుట
చూచుచున్నాము నీ వైపు - మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు = చూచుచు నీ ప్రేమ - సొంపు సువార్తను జాచుచు గరములు - చక్కగా నీవైపు ||చూచు||
1.మే మరులమై యుంటిని - మార్గము వీడి మేమందరము పోతిమి = ప్రేమచే నప్పుడు - ప్రియ తనయు నంపించి - క్షేమమార్గము మాకు - ప్రేమను జూపితివి ||చూచు||
2.నిను నమ్ము పాపులకు - వారెవ రైన - నీ శరణు జొచ్చువారలకు = ఇనుడవు కేడెంబు - నీ జగతిలో నగుచు - గనుపరచుచుందువు - ఘనమైన నీకృప ||జూచు||
3.నీ భయము మాయెదలను - నిలుపుము నీదు - ప్రాభవ మొనరంగను = భయముచే మేము - వైభవ మొందుచు - నే భయము లేకుండ - నీ భువిని గొన్నాళ్లు ||చూచు||
4.దయజూచి మము నెప్పుడు - మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు = దయచేయ రానివి దయచేయుమని కోర - దయజూపి మన్నించు - దయగల మాతండ్రి ||చూచు||
– పులిపాక జగన్నాధము
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment