Vijaya Geethamul Padare | విజయగీతముల్ పాడరే

77            రక్షకునియందలి విజయము
రా – శహన                                  తా – త్రిపుట

విజయ గీతముల్ పాడరే - క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే – వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ – నిజ కుమారుని నామమున్
హృదయములతో - భజన జేయుచు నిత్యమున్ ||విజయ||

1. మంగళముగ యేసుడే - మనకు రక్షణ శృంగమై మరి నిలచెను – నింగిన్ విడిచి వచ్చెను - శత్రుని యుద్ధ  రంగమందున గెల్చెను – రంగు మీరగదన - రక్త బలము వలన పొంగు నణగ జేసెను –సాతానుని బల్ - కృంగ నలిపి చీల్చెను ||విజయ||

2. పాపముల్ దొలగింపను - మనలను దన స్వ- రూపంబునకు మార్పను – శాపం బంతయు నోర్చెను - దేవుని న్యాయ కోపమున్ భరియించెను – పాప మెరుగని యేసు – పాపమై మనకొరకు – పాప యాగము దీర్చెను – దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ||విజయ||

3. సిలువ మరణము నొందియు – మనలను దనకై – గెలువన్ లేచిన వానికి –చెలువుగన్ విమలాత్ముని – ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి – కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని
సిలువ మోయుచు నీ కృపా – రక్షణ చాల విలువ గలదని చాటుచు  ||విజయ||
                             - అల్లారి పెదవీరాస్వామి

No comments: