Siluve na sharanayenu | సిలువే నా శరణాయెను

198
సిలువ బలము 
రా - కురంజి,  తా - ఆది

సిలువే నా శరణాయెను రా - నీ - సిలువే నా శర - ణాయెను రా = సిలువ యందే ముక్తి బలము - జూచితి  ||నీ సిలువే||

1.సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకు లందు = విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా  ||నీ సిలువే||

2.సిలువను జూచుకొలది - శిలసమానమైన మనసు = నలిగి కరిగి నీరగు చున్నది రా  ||నీ సిలువే||

3.సిలువను దరచి తరచితి - విలువ కందగ రాని నీ కృప = కలుష మెల్లను బాపగ జాలును రా ||నీ సిలువే||

4.పలు విధ పథము లరసి - ఫలిత మేమి గాన లేక = సిలువయెదుటను నిలచి నాడను రా ||నీ సిలువే||

5.శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా = దురిత దూరుడ నీ దరి జేరితి రా  ||నీ సిలువే||
– చెట్టి భాను మూర్తి
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: