5
దైవ స్తుతి
రా - నవరోజు, తా - త్రిపుట
నీతిగల యెహోవా స్తుతి మి - యాత్మతో నర్పించుడి - మియాత్మతో సేవించూడి = దాతయౌ మన క్రీస్తు నీతిని - దాల్చుకొని సేవించుడి ||నీతి||
1.¹చదల బుడమియు రవియు జలధియు - నదులు గిరులును జక్కగా = ²సదమలంబగు దైవ నామము - సర్వదా నుతిజేయను ||నీతి||
2.సర్వశక్తుని కార్యముల కీ - సర్వరాష్ట్రము లన్నియు = గర్వములు విడి తలలు వంచుచు - నుర్విలో నుతి జేయను ||నీతి||
3.గీత ³తాండవ వాద్యముల చే - బ్రీతి పరచెడు సేవతో = పాతకంబులు పరిహరించెడు - దాతనే సేవించుడి ||నీతి||
4.పరమదూతలు నరులు పుడమిని - మొదలు బెట్టుచు దేవుని = పరము నందున్నట్టి యేసుని - పాదములు సేవింతురు ||నీతి||
5.ఇలను భక్తులు గూడుకొనియా - బలము గల్గిన దేవుని = వెలయు స్తుతి వే నోళ్లతోడను - విసుగు జెందక జేయుడి ||నీతి||
6.ఆత్మ నీవిక మేలుకొని శు - ద్ధాత్మ యేసుని దండ్రిని = త్రిత్వమగునా యేక దేవుని - హర్షమున సేవింపవే ||నీతి||
- పసుపులేటి దావీదు
________________________________
¹ఆకాశము. ²పరిశుద్ధము. ³నాట్యము.
DOWNLOAD MP3 SONG HERE 👇