Nadipinchu naa naava | నడిపించు నానావ

661
నడిపించు నానావ - నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున - నా జన్మ తరిఇంప

1. నాజీవిత తీరమున - నా యపజయ భారమున
నలిగిన నాహృదయమును-నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ - నాదీక్ష ఫలియింప 
నా నావలో కాలిడుము - నా సేవ జే కొనుము  ||నడిపించు||

2. రాత్రంతయు శ్రమపడినా- రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినను- రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ||నడిపించు||
 
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి 
అహమును ప్రేమించుచునే- అరసితి ప్రభు నీకలిమి
ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే 
ఆథ్యాత్మిక లేమిగని - అల్లాడె నావలలు ||నడిపించు||
 
4. ప్రభుమార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
 ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది
 ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీమాట ||నడిపించు||
 
5. లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా 
లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు
లోపించని యర్పణగా - లోకేశ జేయుమయ ||నడిపించు||
 
6. ప్రభుయేసుని శిష్యుడనై - ప్రభుప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణతో- పరిపూర్ణ సమర్పణలో
ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణము చేతు ||నడిపించు||
- ఎ. బి. మాసిలామణి
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: