Dharaniloni dhanamulella | ధరణిలోని ధనములెల్ల

291
శాశ్వత ధనము
రా - నాట,  తా - ఏక

ధరణిలోని ధనములెల్ల - ధరణిపాలై పోవును - గరిమతోడ నీవు గైకొను - నిరత ముండెడి ధనమును ||ధరణి|| 

1.యేసు నందు నిత్యజీవం - బిపుడు దేవు డిచ్చును = తీసి కొనుము దాని వేగము - దివ్య వరముగ నమికన్ ||ధరణి||

2.విడువు నీదు పాపములను - తడవు జేయ బోకుమీ = విడువ కున్న నీకు గల్గు - వేద నాధికంబుపో ||ధరణి||

3.పరుల మాటల బట్టి నీవు - పడకు మోస మందున = నరుల కొఱకు జీవ మిచ్చిన - పరమ ధాముని నమ్ముమీ ||ధరణి||

4.తలంచుకొనుమీ ధరణిలోన - నిలుచు కాల మంతట =  విలువలేని యేసు ప్రేమ - విధము చక్కగ నెఱుగుచు ||ధరణి||

5. దేవ కృపను బోలునట్టి - దివ్య భాగ్య మొకటి యున్ = నీవు చూడ బోవు మిత్ర - నేలనెచట వెదకినన్  ||ధరణి||
 పులిపాక జగన్నాధం
DOWNLOAD MP3 SONG HERE👇

No comments: