81
యేసు నామ భజన
రా - హిందూస్థాని, ఆది - తోడి
భజన చేయుచు భక్త పాలక - ప్రస్తుతింతు నీనామమును = వ్రజినముల పై జయము నిచ్చిన - విజయుడా నిను వేడుకొందు ||భజన||
1.దివ్య పదవిని విడిచి నీవు - దీనుడవై పుట్టినావు = భవ్య మైన బోధ లెన్నో - బాగుగా ధర నేర్పినావు ||భజన||
2.నరుల గానను పరమునుండి - ధరకు నీవు వచ్చినావు = పరుడనైన నాకొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజన||
3.చెడినవాడ నైన నన్ను - జేర దీసి ప్రోచినావు = పడిన నాదు గోతి నుండి - పైకి లేవనెత్తి నావు ||భజన||
4.ఎంతప్రేమ యెంతదయ - యెంతకృప యేసయ్య నీకు = ఇంత యని వర్ణింప నిలలో - నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||
- దొరిసామి ఆరోగ్యము
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment