252
దేవుని వాక్యము
రా - ఖరహరప్రియ, తా - అట
దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి - దేను మన కో యన్నలారా = భావ శుద్ధిని జేయు ఘన శుభ - వర్తమానము దీని పేరు ||దేవుఁ డిచ్చిన||
1.భయముతో భక్తితోఁ జదివినఁ - ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ దెల్పును = దయా మయుఁడగు దేవుఁడే మన - తండ్రి యని బోధించు నెల్లెడ ||దేవుఁ డిచ్చిన||
2.సత్యశాంతము లంకురించును - సత్క్రియా ఫలములును బొడమును = నిత్యజీవము గలుగు దానన్ - నిస్సందేహముగ నుండును ||దేవుఁ డిచ్చిన||
3.ఈ సుమంగళ దివ్యవాక్యము - నిప్పుడే మీ రనుసరించుఁడు = దోసములు నెడబాసి మోక్షపుఁ = ద్రోవఁ గోరిన వారలెల్లరు ||దేవుఁ డిచ్చిన||
4.పాపములలో నుండి విడుదలఁ - పరమ సుఖ మని దలఁతు రేనియుఁ = తాప మార్పును లేచి రండి - త్వరగఁ క్రీస్తుని శరణు బొందను ||దేవుఁ డిచ్చిన||
5.దురిత ఋణములు దీర్చు మధ్య - స్థుండు గావలె నన్న వారలు = త్వరగ రండీ త్వరగ రండీ - వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుఁ డిచ్చిన||
6.మరణమునకై భయము నొందెడి - మానసము గల వార లెల్లరు = పరమ శాంతి యొసంగు క్రీస్తుని - పజ్జ డాయఁగ రండి వేగము ||దేవుఁ డిచ్చిన||
7.నిర్మలాంతఃకరణ సౌఖ్యము - నిజముగా నిలవెదకువారు = ధర్మచిత్తుండైన క్రీస్తుని - దరికి రండి రండి వేగము ||దేవుఁ డిచ్చిన||
మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు - బుద్ధి గలిగిన వార లెల్లరు = రక్ష కుండగు యేసు నొద్దకు - రండి రండి విశ్వసించుచు ||దేవుఁ డిచ్చిన||
– పురుషోత్తమ చౌదరి
No comments:
Post a Comment