Ninnu chudalani ninne cheralani | నిన్ను చూడాలని నిన్నే చేరాలని

నిన్ను చూడాలని నిన్నే చేరాలని 
నీతోనే కలిసి నడవలని
ఆశ నాలో కలుగుచున్నదయా

1. నీతో కలసి నడచినపుడు
    నాదు అడుగులు తడబడలేదె
    నా త్రోవకు వెలుగుగ - నీవే ఉండాలని
    నీ అడుగు జాడలో - నేను నడవలని

2. నీదు ముఖమును చూచినపుడు
    నాకు నిత్యము సంతోషమే
    నీ ముఖ కాంతిలో - నే హర్షించాలని- 
    నీదు రూపులో నేను మారాలని

3. నీ సన్నిధినే చేరినపుడు
    నిత్యము నీలో పరవశమే
    పరిశుద్ధులతో స్తుతియించాలని
    నీదు మహిమలో - ఆనందించాలని

No comments: