Najareyuda ninne chudalani| నజరేయుడా నిన్నే చూడాలని

నజరేయుడా నిన్నే చూడాలని
నీతో నడవాలని ఆశగా
నాయేసయ్య నీలో నిలవాలని
స్తుతించాలని ప్రేమగా (2)
ప్రాణమిచ్చినావు నాకోసమా (2)
నీ మనసేంతో బంగారమా (2)

నీ దివ్యమైన నీ ప్రేమతో
నా హృదయమంతా ఉప్పొంగగా (2)
దేవా నీలో చేరుటయే
నాకెంతో ఐశ్వర్యమా (2) ||నజరేయుడా||

అనుదినము చేసే నీ సేవకై
నీ ధన్యతలో నన్ను నడిపితివా (2)
తండ్రి నీలో జీవించుటే
నాకున్న ఆశ నిజమైనదా (2) ||నజరేయుడా||

No comments: