23 November 2021

ఆశీర్వాదములకు వారసులైయుండుడి

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము ⛪
✝️ *ఆశీర్వాదములకు వారసులైయుండుడి*✝️

"ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి." 
1 పేతురు 3:9  

విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఈ వాక్యంలో కనబడుచున్నది. ఇతర విశ్వాసుల పట్ల, క్రీస్తు పట్ల, మరియు శత్రువులు పట్ల కూడా ప్రేమ చూపించే వానిగా నీవు ఉండాలి. ఇతరులను ప్రేమించినట్టు నటిస్తే ఏదో లాభం కలగవచ్చు అనుకునే ఆలోచనలు పొరపాటు. ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకమైన వాటినన్నింటినీ అసహ్యించుకోవడం నేర్చుకుంటాము. క్రీస్తు ప్రేమించిన రీతిగా నీవు కూడా మనుషులను ప్రేమించాలి గానీ దూషించుకుడదు. దేవుని ప్రేమిస్తే ఆయన సేవలో మనకు ఆసక్తి ఉంటుంది. నిజానికి ఆయన పట్ల నీ ప్రేమని మాటల్లో గాక, ఆయనకు కోసం నీవు చేసేదానిలోనే వెల్లడి అవుతుంది. మంచి ప్రవర్తనతో క్రీస్తు బిడ్డ గా మాదిరికరంగా జీవిస్తే, దేవుడు నిన్ను తన వారసునిగా ఆశీర్వదిస్తాడు అటువంటి ప్రేమ కలిగి జీవించుట కృప నీకు తోడైయుండును గాక!

🛐 *ప్రార్థన*🛐
 నా ప్రియ ప్రభువా! నేను మీ నిత్య సన్నిధిలో ఆశీర్వాద వారసునిగా నుండునట్లు నీవు నన్ను ప్రేమించినట్లు నేను కూడా ఇతరులను ప్రేమించు జ్ఞానముతో నన్ను నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...