నీ మాట చొప్పున

🙏ప్రభువు నామములో శుభోదయం...🙏
నేడు దిన ధ్యానము:-⛪

✝️(((నీ మాట చొప్పున)))✝️

సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు  గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు  మునుగునట్లు నింపిరి. 
 - లూకా – 5 : 5-7.

యేసుప్రభువు పేతురుతో దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పెను. వచ – 4. పేతురు అతని స్నేహితులు బాగా అలవాటు పడిన మత్స్యకారులు. రాత్రంతా శ్రమించినాకూడా ఒక్క చేప కూడా దొరకలేదు. అందుకు పేతురు ” ప్రభువా, రాత్రంతా ప్రయాసపడితిమి గాని ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాటచొప్పున వేతును” అని ప్రభువుతో అంటాడు. ఆ ప్రకారమే వాళ్లు వల వేస్తారు . అప్పుడు వాళ్లు అత్యధిక సంఖ్యలో విస్తారమైన చేపలు పట్టి, వాటిని వాళ్లు మాత్రమే ఒడ్డుకు లాగలేక, వాళ్ళ పాలివారికి, వచ్చి సహాయం చేయమని అడిగారు. అందరూ కలిసి రెండు దోనెలనిండా చేపలు నింపి ఒడ్డుకు చేర్చారు.

అవును ప్రియ సహోదరి, సహోదరులారా మనం మన సమస్యల నుండి బయటకు రావడానికి అనేక ప్రయత్నాలు చేసి, చేసి విసిగిపోతున్నాము. ఏ ఒక్కటి పనిచేయడంలేదు. ప్రియమైన వారలారా, పలుకుబడి ఉన్న వారి పైన, బంధుమిత్రుల పైన, రాజకీయ నాయకుల పైన, వైద్యుల పైనా , మన స్వంత శక్తి పైన, తెలివి పైన ఆధారపడక మన సమస్యలను దేవుని చేతికప్పగించుదాం. మన స్వంత ప్రయత్నాలు చేస్తే మనం విఫలమవ్వవచ్చు, కానీ యేసయ్య పైన ఆధారపడుదాం. యేసయ్య ఎప్పుడూ ఓడిపోరు, విఫలం కారు, కానీ ఎల్లప్పుడూ సఫలత, విజయమే.

🛐ప్రార్థన:🛐
మా ప్రియ ప్రభువా, ఎల్లప్పుడూ మీ మీద నమ్మకం ఉంచడానికి సంపూర్ణంగా మీ పైనే ఆధారపడటానికి, మీకు విధేయులగునట్లు, మా పనులు మీ ద్వారానే జరిగించుకొనునట్లు మాకు సహాయము చేయండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్.

👉పరలోకపు తండ్రీ , మీకు విధేయత చూపునట్లు నన్ను ఒప్పించండి. – లైలా గిఫ్టి అకిట.

No comments: