29 October 2021

బలము నొందుకో

🙏ప్రభువు నామములో శుభోదయం.🙏..

⛪నేడు దిన ధ్యానము⛪

✝️ *బలము నొందుకో*✝️

యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.
నెహె 8:10

దేవుని యందు ఆనందించుట అనేది చాలా గొప్ప లక్షణం. దేవుడు తన ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. దేవుని యందు ఆనందించువాడు ఎల్లప్పుడూ విజయాలే పొందుకుంటాడు. ఒకవేళ కష్టం వచ్చినా దాని నుంచి జయించడానికి ఆయన నీకు శక్తినిస్తాడు. దేవుని కొరకు బలంగా కార్యాలు చేయగలుగుతావు. అలానే దేవుని లో ఆనందించని వాడు ఎన్నటికీ దేవుని బలము పొందుకోలేరు. లోకరీతి క్షణమైన జీవితంలో బలం అధికారం ఏదైనా ఉండవచ్చు కానీ అవి శాశ్వతమైన ఆనందం బలాలు కాదు అందుకే నీవు నీ జీవితంలో అశాశ్వతమైన వాటి కొరకు పరుగులు తీయగా శాశ్వతమైన ఆనందాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నీ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు అంతే కానీ అసలు ప్రయత్నించకుండా నా జీవితంలో ఆనందం లేదు నేను ఏమి చేయలేకపోతున్నాను. ఏమి చేయాలన్న నా దగ్గర బలము లేదే అని నిరాశ పడిన రోజున సాతానుకి నీ జీవితము పై అధికారం వస్తుంది. అందుచేతనే ఎంత కష్టం వచ్చినా కృంగిపోకు, నిరాశపడకు, దేవుని పై ఆధారపడు, నీ జీవితానికి ఆనందం లభిస్తుంది. దేవుని పై ఆధారపడే వారికే ఆయన బలము కలుగజేస్తాడు. అటువంటి  కృపా సహాయము దేవుడు నీకు కలుగజేయును గాక!

🛐 *ప్రార్ధన:-*🛐 
నా దేవా నా జీవితాంతం మీ పై ఆధారపడి బలము పొందుకొనే కృపను నాకు దయ చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...