28 October 2021

ఎక్కువ ఆశీర్వాదము

🙏ప్రభువు నామములో శుభోదయం..🙏.
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️ *ఎక్కువ ఆశీర్వాదము*✝️

 "సమస్త జనములకంటె ఎక్కువగా 
నీవు ఆశీర్వదింప బడుదువు"
- ద్వితీ.కాం. 7:14 

దేవుడు నీ పట్ల జరిగిన చిన్న చిన్న కార్యాలను ఆయన చేసిన పనులను గుర్తు చేసుకోవటం వలన దేవుడు నీ కృతజ్ఞత మనసును చూస్తున్నాడు. ఆయన నీ యెడల చేసిన పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం అనేది భక్తికీ,నమ్మకానికీ సహాయకరము.నీవు సమస్త జనముకంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాను. అనే వాగ్దానం నీవు మంచివాడవని గానీ, తెలివైన వాడవనీ, అధిక సంఖ్యాకులు కలవాడవని గానీ, బలవంతుడవనీ గానీ దేవుని ప్రేమించడం లేదు. నిన్ను ప్రేమించాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు గనుక ఆ ప్రేమ నీ పట్ల శాశ్వతంగా నిలిచి ఉంటుంది. దేవుని ప్రేమ దీవెనలు మీ పట్ల శాశ్వతంగా నిలిచి పోవాలంటే ఈ లక్షణాలు కలిగి జీవించాలి 1) దేవుని ఎదుట అణుకువగా కలిగి ఉండడం, 2) పరీక్షించడం 3) నీ హృదయ స్థితి వెల్లడి చేయడం.వీటిని గ్రహిస్తున్నాడు. ఇంత ధన్య కరమైన ఫలితాలను నీకు కలిగించటం కేవలం నీ మీద ఉన్న గొప్ప ప్రేమ వల్లనే.నీకు సమృద్ధిగా ఇవ్వటం, సకల సౌభాగ్యాలు ఉండడం కూడా ప్రమాదకరమే. ఎందుకంటే అతిశయించుడం, అనే భావం నీలో వెలువడతాయి. అందువల్ల సంపదలు కలిగి దేవుని మర్చిపోవడం కన్నా పేదరికంలో విశ్వాసముతో జీవించడం ఎంతో మిన్న.

సమస్త జనముగా కంటే ఎక్కువగా అనీ వాగ్దానము నీ జీవితంలో చాలా గొప్పది. అందరికంటే ఎక్కువగా అనే వాగ్దానమే నీ జీవితంలో చాలా గొప్పది.అందరికి కంటే అంత ప్రేమిస్తున్న దేవుని ప్రేమకంటే ఈ లోకం ఏ పాటిది. కాబట్టి దిగులు పడక నీ హృదయస్థితిని దేవునికే సమర్పించి,శాశ్వతమైన ప్రేమ పొందుకుంటూ దీవించబడటానికి దేవుని ప్రేమ నీకు తోడై యుండును గాక!

🛐 *ప్రార్ధన*🛐
నా ప్రభువా!ఆణుకువ గల హృదయము కలిగి సంపూర్ణ ఆనందంలో సమస్త జనము కంటే నేను ఎక్కువ దీవించబడునట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరము తండ్రి.ఆమెన్!

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...