Yesu Kreesthu Vaari | యేసుక్రీస్తు వారి కథ వినుడి


యేసుక్రీస్తు వారి కథ వినుడి - దేశీయులారా - యేసుక్రీస్తు వారికథ వినుడి = దోసకారులన్ రక్షింప - దోసములంటని రీతిగనె - దాసుని రూపంబుతో మన - ధరణిలో వెలసిన దేవుండౌ || యేసుక్రీస్తు || 

1. రోగులన్ కొందరిని జూచి - బాగుచేయునని యనలేదు - రోగముల తీరది పరికించి - బాగు చేయలేనన లేదు - రోగముల నివారణకైన - యోగముల్ తాజెప్పలేదు - యోగ యోగుల మించు వైద్య - యోగి తానని ఋజువుగొన్న || యేసుక్రీస్తు || 

2. పాపులను నిందించి యేవిధ - శాపవాక్కుల్ పల్కలేదు - పాపులకు గతిలేదని చెప్పి - పారద్రోలి వేయలేదు -  కోప పడుచు పాపులను రా - కూడదని వచియింపలేదు = పాపములు పరిహారము చేసి - పరమదేవుడు తానని తెల్పిన || యేసుక్రీస్తు ||

3. నరులకు దేవుడు తండ్రియగు - వరుస బైలుపరచినాడు పొరుగు - వారు సోదరులన్న - మరొకవరుస - తేల్చినాడు మరియు దేవున్ - పొరుగు వారిన్ - సరిగ ప్రేమించు మన్నాడు = కొరత లేకుండ సర్వాజ్ఞల్ - నెరవేర్చి మాదిరి జూపిన|| యేసుక్రీస్తు ||

4. వాక్కు వినవచ్చినవారలకు - వాక్యహారమున్ తినిపించె ఆకలితో - నున్న ఆయైదువేలన్ గనికరించె - మూకకు వండని రొట్టెలను - బుట్టించి తృప్తిగా వడ్డించె = లోకమంతకు పోషకుడు తా - నే కదా యని మెప్పుగాంచిన || యేసుక్రీస్తు ||

5. దురితములను తత్ఫలములను - దుష్టుడౌ సైతానును గెల్చె తరుణ - మందు మృతులన్ లేపె - దయ్యములను దరిమివైచె నరుల - భారమున్ వహియించి - మరణమొంది తిరిగిలేచె = తిరుగవచ్చెద - నంచు మోక్ష -పురము వెళ్ళి గూర్చున్న ||యేసుక్రీస్తు ||

6. పాపులకు రోగులకు బీద - వారికి దేవుండుయేసె ఆపదలన్నిటిలో - నిత్య - మడ్డుపడు మిత్రుండు క్రీ స్తే - పాపమున పడకుండగా - పాడెడు శిల యేసుక్రీస్తే - పాపు లాశ్రయించిన యెడల - పరలోకమునకు గొంపోవు || యేసుక్రీస్తు ||

7. మరల యూదుల్ దేశమునకు - మళ్ళుచున్నారిదియొక గుర్తు - పరుగులెత్తుచున్నవి కారుల్ - బస్సులు ఇది మరి యొకగుర్తు - కరు వురు మతవాదాలు భూ - కంపముల్ యుద్ధా లొకగుర్తు = గురుతులై పోయినవి గనుక - త్వరగ వచ్చుచున్న శ్రీ ||యేసుక్రీస్తు ||

No comments: