విరబూసిన పుష్పమా - జతకలిసే బంధమా - నేడు సంతసించుమా
ప్రేమించే స్నేహమా - నా తోడైయుండుమా - దేవుని చిత్తమందున
నువ్వు నేను ఒకరికి ఒకరై – విశ్వాస ప్రేమలతో జీవిద్దామా
గృహజీవనమే - ప్రభు దీవెనయే కలకాలంవుందాం - క్రీస్తే అధిపతిగా ||విర||
1. ఈ జీవితాన ప్రభుయేసు కోసం - మనమిద్దరం ఒక మందిరం (2)
మన ఆశలన్ని తీర్చే దేవుడుండగా - భయమేల ఇక దిగులెలా(2) ||విర||
2. హృదయాలు రెండు ఒకటాయె నేడు - ప్రార్ధించగా దీవించగా (2)
కష్ట సుఖాలయందు తోడు నీడగా - కడదాకా కలిసి వెళదామా (2) ||విర||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment