49
సాయంతన సమర్పణము
రా – నాదనామక్రియ, తా – ఆది
వినవే నా వినతి నివేదన దయ - వెలయఁగ నో ప్రభువా = నిను శర నొందితి ననుఁ గుశలంబున - నునుపవె యో ప్రభువా ||వినవే||
1.నిర్మల గతి సంధ్యా కాలంబున - నీ స్తవ మగు ప్రభువా = ¹ధర్మదీప్తి నా కొసఁగి చేయు - ²దీప్త వంతునిగ నన్ను ||వినవే||
2.నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని - నేఁబడకుండఁగనుు = ³తన్వాది సమస్తముతో - ననుఁ గావవె ప్రభువా ||వినవే||
3.ఎన్ని దినంబులు జగతి నున్న నీ - కన్న వేరే గలవా = పన్నుగ మది నీ ⁴పద సంగతమై - యున్నది రేవగలు ||వినవే||
4.పాప కరుండను నే ⁵సుకృతా - పాది కర్మ మెఱుఁగ = నీ పాద ⁶సరోజము నా కొసఁగుము - నాపై నీ కృపఁ జెలఁగ ||వినవే||
5.నీ కొరకై నా మనము దృఢంబౌ - గాక యేసు ప్రభువా = నాకుఁ బిశాచముచే భ్రమ జన్మము - గాకుండఁగ నేలు ||వినవే||
– మిక్కిలి నమూయేలు
_______________________
¹పరిశుద్ధమైన వెలుఁగు. ²వెలుఁగుగలవానిగా. ³శరీరము మొదలైన. ⁴పాదములతో గూడుకొనునది. ⁵నత్కార్యములను పుట్టించు. ⁶పద్మము
No comments:
Post a Comment