21
త్రిత్వమునకు స్తుతి
(చాయ: యేసు నీ నామామృతము)
రా - కాంభోజి, తా - ఆది
త్రిత్వమై నిత్యత్వమున నే - కత్వమగు దేవా - నీ = సత్యసామర్థ్యత్వముల నిజ - తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ||త్రిత్వమై||
1. ఎల్లలోకంబుల సృజించిన - చల్లని తండ్రి - నా = యుల్లమున నీ గొప్ప వింత లెల్ల సంతసిల్ల శో - భిల్లఁ దలంచెదను ||త్రిత్వమై||
2. వాసి కెక్కిన పరమరాజ్యని - వాసమును విడిన - శ్రీ - యేసునాధుం డను కుమారా దోషుల దోసంబులెల్లఁలఁఁ - గాచి రక్షించినావు || త్రిత్వమై||
3. ఆదరణకారుండ వగు శు - ద్ధాత్ముడా దేవా - యా = మోద నామము నంపఁబడి యేసు - నాధుని సుబోధ లెల్ల - బోధపరచి పాదుకొల్పు || త్త్రిత్వమై||
4. ఓపితా సుతా శుద్ధాత్మ - ఒక్క దేవుఁడవు - ఎల్ల - పాపులను రక్షింప మిగుల - నోపికతో నాపదలు - బాపి కృపఁ జూపినావు || త్రిత్వమై ||
No comments:
Post a Comment