Thara Velisindi Aa Ningilo | తార వెలిసింది ఆ నింగిలో


తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని - యూదుల రాజు ఉదయించాడని (2) ||తార||

మందను విడచి మమ్మును మరచి - మేమంతా కలిసి వెళ్ళాములే -
ఆ ఊరిలో ఆ పాకలో - స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే – లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే – ఇది క్రిస్మస్ ఆర్భాటమే||తార||

బంగారమును సాంబ్రాణియు - బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో - నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని - నిను మనసారా కొలిచాములే -
మా యూదుల రాజువు నీవేనని - నిను ఘనపరచి పొగిడాములే||తార||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: