69 దైవ స్తుతి
రా – శంకరాభరణము (చాయ: యెహోవా సన్నిధి) తా – ఆది
సర్వదేశములారా - శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో గురుస్తోత్రము జేయను రండి || సర్వ ||
1. ఆ ప్రభువే దేవుండు – అధికస్తోత్రార్జుండు = భూప్రజలు నందరిని బుట్టించిన భగవంతుండు ||సర్వ||
2. మనము దేవుని వార మును మరి యాయన ప్రజల = మనయము నా ఘనప్రభువు – నెనరుతో మేపెడి గొట్టెలము ||సర్వ||
3. కృతజ్ఞతార్పణలు – కొల్లగను జల్లింప = నాతని యావరణములో – నతి వినయముతోఁజేరండి ||సర్వ||
4. ఆయన దయామయుఁడు ఆయన కృపామయుఁడు = ఆయన ప్రేమ సత్యం – బనవరతం బుండును నిజమే || సర్వ ||
5. శుభనామం మదినుంచి – ప్రభునామం స్తుతియించి = ఘననామం బతిభక్తిన్ – అనయము గొలువుడి జనులారా || సర్వ ||
6. పితృపుత్రాత్మకును తాత్మకును – ప్రియ మహిమ మగుగాక = ఆదిని నుండినరీతి ననవరతంబుండును గాక || సర్వ ||
- నరెళ్ల నమూయేలు సుబ్బయ్య
No comments:
Post a Comment