Kreesthuyesuku Mangalam | క్రీస్తుయేసుకు మంగళం

76            క్రీస్తు యేసునకు మంగళహారతి
రా – ఆనందభైరవి (చాయ: తెలుగు తల్లికి వందనం) తా – అట చాపు
                    
క్రీస్తుయేసుకు మంగళం మా – కీర్తి రాజుకు మంగళం = క్రీస్తుయేసే దైవమంచును – కూడి పాడుదు మంగళం.

1. ప్రవచనంబులు బల్కినట్టి – ప్రాణనాధుడవీవె నీదు = స్తవము జేయుచు మెలగు మనుజుల – సమ్ర్పభువుకిదె మంగళం || క్రీస్తు||

2. జగమునేలెడు జీవనాధుడ – జపములందెడు గృపకటాక్ష = అగణీ తంబగు ప్రేమజూపిన – అమరతేజుడ మంగళం || క్రీస్తు ॥

3. ఖలుల బ్రోచెడు కనికరాత్మ – కేంద్ర స్థానము నీ పదాబ్జము = కలుషమును కడమార్చినట్టి – సిలువ నాధుడ మంగళం || క్రీస్తు||

4. మనము గోరెడు మా హృదీశుడ - మార్గదర్శుడ వీవెగావ = అనయము నినుగొల్చు జనముల – ఆది దేవుడ మంగళం || క్రీస్తు ||

5. జనకసుత శుద్ధాత్మ దేవుడ – గనని వినని ప్రేమ పూర్ణుడ – తనివితీరు పాడుదము యీ – ధాత్రి నీకగు మంగళం || క్రీస్తు ॥
                                               – సి . రవివర్మ

No comments: