Devuni Neethi Prathapam Bhuvi Yesu | దేవుని నీతి ప్రతాపం భువి యేసు

96                 యేసుక్రీస్తు దేవుడు

1. దేవుని నీతి ప్రతాపం - భువి యేసుని సిల్వ ప్రభావం 
దేవుల దేవుని అపురూపం - భువి యేసుని నామ స్వరూపం 
దేవ యెహోవ సువాక్యం - సౌభాగ్యం దైవ జనుల హృదయానందం 

       || యేసుక్రీస్తు దైవ సుతుండు 
          యేసుక్రీస్తు మనుజసుతుండు 
          యేసుక్రీస్తు దేవుండు
          యేసే ప్రభువు - స్తుతిపాత్రుడు ||

2. ఆద్యంత రహిత కీర్తి - అవతార శ్రమార్జన మూర్తి
ఆకస రాసుల ఆదిపతి - అవనీ సృజనాత్మ ప్రతీతి
అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత అనుదిన కృపాలిడు సుఖదాత

3. పాపము భయపడు నామం - పాపాత్ముడు కృపగను హోమం 
పతితుల వెదకిన ప్రేమస్వరం - పరలోక సుఖాల విహారం 
పాప క్షమాపణ గానం - బహు అనవరతము నిజబలిదానం [మానం

4. జనముల జీవాధిపతి - జగమంతటి నేలెడి జ్యోతి 
జీవుల అంతిమ న్యాయపతి - జీవాత్ములు క్రోలెడి నీతి 
జనన మరణ జయశీల - నరపాల జగతిని మార్చెడి శుభజ్వాల.
                           - ఏ.బి. మాసిలామణి

No comments: