Enthativaadanu Nenu Yessayya Konthaina | ఎంతటివాడను నేను యేసయ్యా కొంతైనా

ఎంతటివాడను నేను యేసయ్యా - కొంతైనా యోగ్యుడను కానయ్యా 
ఇంతగ నను హెచ్చించుటకు - ఈ స్థితిలో నన్నుంచుటకు 

1. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే
 హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే
 అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు
 ప్రాణమును నీ సర్వమును నాకొరకై అర్పించినావు

2. నిను వెంబడించువారిని - నిజముగ సేవించువారిని 
నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని  
ఎంతో ఘనపరచెదవు - ఆశీర్వదించెదవు శత్రువులకంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు  

3. వినయముగల మనుష్యులను వర్థిల్లజేసెదవు
 గర్విష్టుల గర్వమునణచి గద్దెనుండి దించెదవు
 మాదు ఆశ్రయ దుర్గమా - మేమంతా నీవారమే 
మా శైలము మా కేడెమా - మాకున్నదంతా నీ దానమే
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: