అలరారు ఆ దివ్యరూపం -
పశుశాలలో వెలిగే దీపం
పరిహరింపను మానవపాపం -
ప్రభవించెను ఇలలో ఆనందం (2) ||అలరారు||
1.ప్రకృతియే పరవశించి ఆడె -
పరలోక సైన్యాలు పాడె (2)
భక్తితో ఆ బాలునివేడ -
చూపించే ఒక తారజాడ (2) ||అలరారు||
2.జగతిలోన మానవులను చూచె -
బాలయేసు రూపము దాల్చె (2)
గొల్లలే సేవింప రాగా -
ప్రణమిల్లు ఈ దినమే వేగ (2) ||అలరారు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment