పూజించెదను పూజ్యనీయుడా ..(2)
నిజదైవమా రవితేజమా (2)
పూజించెదను పూజ్యనీయుడా ..(2)
1.వెండి బంగారములు కోరలేదు నీవు - నలిగిన మనస్సే అడిగినావు (2)
విలువైన వాసములు ఆశింపక నీవు(2) -నా హృదిలో ఉండగోరినావు (2) ||పూజించెదను||
2.ఏ కొండనో నిలచి అక్కడికి రమ్మనక - నా చెంతకే వచ్చినావు (2)
నదులలో మునిగి శుద్దికమ్మనక (2) - నాలో జీవ నదులుంచినావు (2) ||పూజించెదను||
3.దుష్టుడనైన నన్ను శిక్షకు గురిచేయక - క్షమియించి రక్షించినావు (2)
ఒక్క నిముషమైనా నన్ను ఎడబాయక (2)- నాతో నుండే దేవుడవు నీవు (2) ||పూజించెదను||
No comments:
Post a Comment