గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన - మానవాళి విడుదల కొరకైన ప్రార్థన (2)
నీ కోసమే - నా కోసమే ఆ మరణ పాత్ర మన పాప ఫలితమే (2)
1.ఘోరమైన శ్రమలెన్నో పొందాలని -
కలువరి వరకు సిలువ మోయాలని (2)
ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను -
తన తండ్రి చిత్తమునకు తలవంచెను (2) ||నీ కోసమే||
2.కొంచెమైన మంచితనము లేని పాపిని -
సంపూర్ణ స్వస్థతతో నింపాలని (2)
గాయములు పొందుటకు సిద్దమాయెను -
తన తండ్రి చిత్తమునకు తలవంచెను (2) ||నీ కోసమే||
3.క్షయమగు మనిషిని మహిమకు మార్చాలని - అక్షయమగు రాజ్యములో చేర్చాలని (2)
మరణంపు ద్వారమున ప్రవేశించెను -
తన తండ్రి చిత్తమునకు తలవంచెను (2) ||నీ కోసమే||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment