532
యేసునకు స్తుతి
రా-ముఖారి, తా-ఆది
(చాయ:దిన దినమునకు దిక్కునీవే)
చేతులెత్తి వందనములు - చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగలందు మముఁ - బ్రీతితోఁ గాపాడు యేసు ||చేతు||
1. సుఖమైనట్టి నిద్ర మమ్ము - నొందఁజేసి రాత్రియందు - సకల మేలు లంద జేయు - స్వామి యేసుక్రీస్తూ నీకు||చేతు||
2. అన్నవస్త్రములను మాకు - నన్ని వేళలందు నిచ్చి - కన్న తండ్రివలెను బెంచు - చున్న యేసుస్వామీ నీకే ||చేతు||
3. విద్యా బుద్ధులన్ని యిచ్చి - వింత వింత వరము లిచ్చి పెద్దల దయలోనుమమ్ముఁ - బెంపారఁ జేయు మేసయ్యా ||చేతు||
4. చిన్నవారి స్నేహితుడుగ నున్న - యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు - నిలలో నెపుడు కలుగుగాక ||చేతు||
- నరెళ్ళ సమూయేలు సుబ్బయ్య
DOWNLOAD MP3 S ONG HERE 👇
No comments:
Post a Comment