Aathmiya Vasanthakaalam Naluvadi | ఆత్మీయ వసంతకాలం నలువది దినాల

ఆత్మీయ వసంతకాలం - నలువది దినాల ధ్యానం
కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం(2)
లోకానికి దూరంగా - దేవునికి సమీపంగా 
ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం (2) ||ఆత్మీయ||
                                            
1.లోకాశలకు లాగెడు శత్రువులు - 
అపవాదిని ఈ దేహమును జయించను (2)
ఉపవాసముతో - దైవ సన్నిధిలో గడిపి 
తరించే ఆశీర్వాద కాలం (2) ||ఆత్మీయ||
                                         
2.అవమానభరిత సిలువ మరణమును - 
పొందిన ఆ త్యాగశీలిని తలువను (2)
పశ్చాత్తాపముతో - నియమ నిబంధనతో 
ప్రార్థనలో గడిపే దీవెనకాలం(2) ||ఆత్మీయ||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: