పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు ||నమ్మి||
1. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన
బిలాము ఏమాయెను ? దైవ దర్శనం కోల్పోయెను
నా యేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే ||నమ్మి||
2. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను ? అగ్నికి ఆహుతియాయెను
నా యేసయ్యను నమ్మిన యెడల
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే ||నమ్మి||
3. సుఖ భోగము నమ్మి - ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను ? రోగమును సంపాదించెను
నా యేసయ్యను నమ్మిన యెడల
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే ||నమ్మి||
No comments:
Post a Comment