విశ్వమంతా నీ నామము.. ఘననీయము ||యేసయ్యా||
1. నీవు కనిపించని రోజున - ఒక్క క్షణమొక యుగముగ మారెనే
నీవు నడిపించిన రోజున - యుగయుగాల తలపు మది నిండినే (2)
యుగయుగాల తలపు మది నిండినే ||యేసయ్యా||
2. నీవు మాట్లాడని రోజున - నా కనులకు నిద్దుర కరువాయెనే
నీవు పెదవిప్పిన రోజున - నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
3. నీవు వరునిగ విచ్చేయు వేళ - నా తలపుల పంట పండునే
వధువునై నేను నిను చేరగ - యుగ యుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment