యెహోవా నీ నామము - ఎంతో బలమైనది ఆ..ఆ..
ఎంతో బలమైనది ||యెహోవా||
1. మోషే ప్రార్థింపగా - మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్థింపగా - సూర్యచంద్రుల నాపితివి ||యెహోవా||
2. నీ ప్రజల పక్షంబుగా - యుద్ధములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి ||యెహోవా||
3. సింహాల బోనైనను - సంతోషముగ వెళ్ళిరి
ప్రార్థించిన వెంటనే - రక్షించే నీ హస్తము ||యెహోవా||
4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్థింపగా - సంకెళ్ళు విడిపోయెను ||యెహోవా||
5. పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్థింపగా - చెరసాల బ్రద్దలాయె ||యెహోవా||
6. మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా - ప్రకటించే నీ వాక్యము ||యెహోవా||
- కూరాకుల డేవిడ్ గారు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment