ఎన్ని తలచినా - ఏది అడిగినా- జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై వేచియుంటిని నాప్రార్థన ఆలకించుమా
ప్రభువా - నా ప్రార్థన ఆలకించుమా ||ఎన్ని||
1. నీ తోడులేక - నీ ప్రేమలేక -
ఇలలోన ఏప్రాణి నిలువలేదు
అడవి పువ్వులే - నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా .. ప్రభువా(2)||ఎన్ని||
2. నా ఇంటి దీపం నీవే అని తలచి -
నా హృదయం నీ కొరకు పదిలపరచితి
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో.. ప్రభువా (2)||ఎన్ని||
3. ఆపదలు నన్ను వెన్నంటియున్న -
నా కాపరి నీవై - నన్నాదుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా (2)
నీ నుండి వేరు చేయవు.. ప్రభువా (2) ||ఎన్ని||
4. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి -
నా కొరకై కల్వరిలో యాగమైతివి
నీదు యాగమే నాదు మోక్షము
నీ యందే నిత్య జీవము.. ప్రభువా (2) ||ఎన్ని||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment