Chinna gorrepillanu nenu | చిన్న గొర్రెపిల్లను నేను

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా - 
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా 
యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా 
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా

1.శాంతి జలములందు పచ్చగడ్డిలో 
కాంతి బాటలో నడుపు యేసయ్య ||యేసయ్య||

2.అంధకార లోయలో నేనుండగా 
ఉండుగాక నీ సిలువ యేసయ్యా ||యేసయ్య||

3.శత్రువైన సాతాను ఎదుటను 
విందుచేసినావు నాకు యేసయ్యా ||యేసయ్య||

4.అంటు నా తలను ఆత్మ నూనెతో 
ఇంట బయట నీ సాక్షినౌదును ||యేసయ్య||

5.ఐదు రొట్టెలు రెండు చేపలు యేసయ్యా 
ఐదు వేల మందికి నీవు పంచగా ||యేసయ్య||

6.ఒక్కటే ఆశ కలదు నాకు యేసయ్యా 
చక్కనైన నీ యిల్లు చేరాలని ||యేసయ్య||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: