Vandanam bhonarthumo prabho | వందనం బొనర్తుమో ప్రభో

601
సాంవత్సరిక కృతజ్ఞతార్పణము
రా - గుల్ రోజు,   తా - ఏక
(చాయ: దేవాదాస పాలన)

    వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో = వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముడా - వందనంబు లందుకో ప్రభో ||వందనం||

1.ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు - గన్న తండ్రి మించి యెపుడు గాచియు = ఎన్నలేని దీవెన - లిడు నన్న యేసువా - యన్ని రెట్లు స్తోత్రము లివిగో ॥వందనం||

2.ప్రాత వత్సరంపు బాప మంతయు - బ్రీతిని మన్నించి మమ్ము గావుము = నూత నాబ్దమునను నీదు - నీతి నొసగు మా - దాత క్రీస్తు నాధ రక్షకా ॥వందనం||

3.దేవ మాదు కాలు సేతు లెల్లను - సేవకాళి తనువు దినము లన్నియు = నీ వొసంగు వెండి, పసిడి - జ్ఞాన మంత నీ - సేవకై యంగీకరించుమా ॥వందనం||

4.కోత కొరకు దాసజనము నంపుము - ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము = పాతకంబు లెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతినొందు నీతి సూర్యుడా ||వందనం|| 

5.మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయుము = మోసపుచ్చు నంధకార మంత ద్రోయుము - యేసు కృపన్ గుమ్మరించుము ॥వందనం॥
- మత్తయి సమూయేలు
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: