685
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే (2) ||రండి||
1.యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన - అబ్బదు శాంతి ఆత్మకు నిలలో (2) ||రండి||
2.కరవు రణము మరణము చూచి - కలుగదు మారు మనస్సు
ప్రవచనములు సంపూర్ణము లాయెను - యూదులు తిరిగి వచ్చుచున్నారు (2) ||రండి||
3.ప్రభుయేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చెగదా
సిలువను రక్తము చిందించియును -
బలియాయెను యాఘనుడు మనకై (2) ||రండి||
4.యేసుని నామమునందే పరమ - నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును -
శక్తిమంతుడు యేసే యిచ్చును (2) ||రండి||
5. నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును
నేనే గాకింకెవరు లేరని -
యెంచి చెప్పిన యేసుని యొద్దకు(2) ||రండి||
DOWNLOAD MP3 SONG HERE 👇