Devuni sthuthiyinchudi | దేవుని స్తుతియించుడి

659
దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి  ||దేవుని||

1.ఆయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిధిలో ఆ.. ఆ... ||దేవుని||

2.ఆయన బలమును ప్రసిద్ధి చేయు - ఆకాశ విశాలమందు ఆ..ఆ.. ||దేవుని||

3.ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి - ఆయన ప్రభావమును ఆ..ఆ..   ||దేవుని||

4.బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి - స్వర మండలముతో ఆ.. ఆ.. ||దేవుని||

5.సన్నతంతుల సితారతోను చక్కని - స్వరములతో ఆ.. ఆ.. ||దేవుని||

6.తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యముతోను ఆ.. ఆ.. ||దేవుని||

7.పిల్లనగ్రోవులు చల్లగనూది - ఎల్లప్రజలు జేరి ఆ.. ఆ.. ||దేవుని||

8.మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి గంభీర తాళముతో ఆ.. ఆ.. ||దేవుని||

9.సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్ ఆ.. ఆ.. హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు ||దేవుని||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: