563
వివాహము
రా - జంఝూటి, తా - ఆది
మానవుల మేలు కొరకు - జ్ఞానియైన దేవుడు = మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మాన||
1.కానాయను నూరిలో మన - కర్త చూచె బెండ్లిని = పానముగను ద్రాక్షరసము - దాన మొసగె బ్రీతిని ||మాన||
2.యేసు వీరిద్దరిని - ఏకముగా జేయుమీ = దాసులుగను జేసి వీరి - దోసము లెడ బాపుమీ ||మాన||
3.కర్త వీరలకు భార్య - భర్తల ప్రేమంబును = బూర్తిగ నీ విచ్చి వీరి - బొందుగాను నడుపుమా ||మాన||
4.భక్తియు విశ్వాస ప్రేమలు- భావమందు వ్రాయమి = ముక్తి సరణి వెదక వీరి - భక్తి మిగుల జేయు మీ ||మాన||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment