ధ్యానించుచుంటిమి - సిలువపై పలికిన -
విలువైన నీ మాటలు (2)
ప్రాణాత్మలను సేదతీర్చు జీవ ఊటలు (2)
మోక్షమునకు చేర్చు బాటలు (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా....||ధ్యానించు||
1. తండ్రి వీరేమిచేయుచున్నారో ఎరుగరు-
వీరిని దయతో క్షమించుము (2)
అని ప్రార్థన చేసావా బాధించే వారికై (2)
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా....||ధ్యానించు||
2. నేడే నాతోను పరదైసులో నీవుందువు -
నిశ్చయముగా ప్రవేశింతువు(2)
అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2)
అధికారముతో పాపిని రక్షించి (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా....||ధ్యానించు||
3. ఇదిగో నీతల్లి ఇతడే నీకుమారుడు -
కష్టము రానీయకు ఎప్పుడు (2)
అని శిష్యునికిచ్ఛావా అమ్మ బాధ్యతను (2)
తెలియచేయ కుటుంబ ప్రాధాన్యతను (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా....||ధ్యానించు||
4. దేవా నాదేవా నన్నువిడనాడితివి వెందుకు -
చెవి నీయవే నా ప్రార్థనకు (2)
అని కేక వేసావా శిక్ష ననుభవిస్తు (2)
పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా..||ధ్యానించు||
5. సర్వసృష్టి కర్తను నేదప్పిగొను చుంటిని -
వాక్యము నెరవేర్చు చుంటిని (2)
అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2)
జీవ జలమును అనుగ్రహించుటకు (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా....||ధ్యానించు||
6. సమాప్తమైయుంది లోకవిమోచన కార్యం -
నెరవేరేను ఘన సంకల్పం(2)
అని ప్రకటన చేసావా కల్వరిగిరి నుంచి (2)
పని ముగించి నీతండ్రిని ఘనపరచి (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా..||ధ్యానించు||
7. నాఆత్మను నీచేతికి అప్పగించు చుంటిని -
నీ యొద్దకు వచ్చుచుంటినీ (2)
అని విన్నవించావా విధేయత తోటి (2)
తలవంచి తృప్తిగ విజయము చాటి (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా..||ధ్యానించు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment