నిజమైన వెలుగు


🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️ *నిజమైన వెలుగు*✝️

నిజమైన *వెలుగు* ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 
యోహాను 1:9 

సృష్ట్యాది దేవుడు కలుగజేసిన వాటిలో *వెలుగు* ఒక ప్రశస్తమైనది అనుగ్రహింపబడినది. అందుకే "మంచిదైనట్టు" దేవుడు చూచిన వానిలో 'వెలుగు' మొదటిది. *వెలుగు* ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. వెలుగు దైవిక సంబంధమైనదిగా చీకటి లేక అంధకారం సాతాను సంబంధమైనదిగా ప్రాచీన కాలం నుండి నమ్మబడుతుంది. వాస్తవానికి చీకటిని దేవుడు సృజించలేదు. వెలుగు లేని చోటే చీకటి! అంధకారం!! వెలుగు ప్రకాశించును అయితే దేవుడు వెలుగును చీకటిని వేరుపరచాడు.అంటే వెలుగు ప్రచురించబడే చోటు, ప్రసరింపబడని చోటుల మధ్య ఒక గీత వుంది. మరో మాట చెప్పాలంటే వెలుగు ప్రసరింపబడటానికి ఒక పరిమితిని దేవుడు ఏర్పరచాడు. ఇశ్రాయేలు చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి. పలుమార్లు పడిపోయారు. అనేకసార్లు ధర్మశాస్త్రాన్ని మీరారు. ఇశ్రాయేలీయులే కాదు యావత్ ప్రజలు దైవిక వెలుగును కోల్పోయి చీకటి సంబంధులుగా జీవిస్తున్నారు. అందుకే యెషయా 9:2 లో "చీకటిలో నడుచు జనులు" అని ప్రస్తావించారు. ఈ చీకటి అనేక అంశాలతో కూడుకున్న చీకటి! అందుకే బైబిల్లో ఆయా సందర్భాల్లో అజ్ఞానాంధకారం, మరణానంతరం, పాపంధకారం విశేషములు ప్రయోగించ పడ్డాయి. ఒక దీపం చుట్టూ ఒక పురుగు తిరుగుతూ ఉంది. అది ఆ దీపంతో ఒక ప్రశ్న అడిగింది. 'వెలుగుతూ ఉండడమే నీ పనా? అని దానికి ఆ దీపం జవాబిస్తూ "కాదు! వెలుగుతూ ఉండడం నా పని కాదు, వెలుగుతూ ఉండడం నా స్వభావం!" అని అంది. ఆ పురుగు ఆశ్చర్యపడుతూ పనికి, స్వభావానికి కి తేడా ఏమిటి అని అడిగింది. జవాబుగా దీపం "పని బయట నుండి ఆరోపించబడేది"కానీ స్వభావం లోపలినుండి ఆవిష్కృతమయ్యేది"! కనుక పని తాత్కాలికం!! స్వభావం ఆమరణాంతం అని చెప్పింది. క్రైస్తవుడు క్రీస్తు వెలుగును స్వీకరించట కేవలం పనిగా కాదు అది ఆంతర్య స్వభావులై నిరంతర ఆధ్యాత్మిక ప్రకాష్ కొద్దిగా బాస్ ఎల్లాలి చీకటిలో నడుచును గొప్ప వెలుగును క్రీస్తులో చూసినట్లు చీకటి నుండి విడుదల పొందాలి.

🛐 *ప్రార్థన:-* 🛐
ప్రభువా! మేము నీ వెలుగులో నడచునట్లు మమ్మును బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.ఆమెన్!

No comments: