మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మత్తయి: 7 : 1


🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
నేడు దిన ధ్యానము:-

(పాపము కొలిచే సాధనము)

మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మత్తయి 7 : 1

తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; లూకా 6 : 37-38.

థెర్మో మీటర్ నుండి గాల్వొనో మీటర్, అమ్మీటర్, వోల్ట్ మీటర్, సి. ఆర్. ఓ, ఇంకా అనేక రకములైన పరికరములను ఉపయోగిస్తారు.

ఒక్కొక్కసారి వీటన్నింటిని చూస్తున్నప్పుడు పాపాన్ని కొలవడానికి కూడా ఒక మీటర్ (కొలత పరికరం ) ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది అనిపిస్తుంది.

మన ఇల్లలో రక్తపోటు పరికరం మధుమేహ పరికరం అన్నీ ఉంటున్నాయి. వాటితో మన రక్తపోటు, షుగర్ అన్నీ పరీక్షించుకుంటాము. ఎందుకంటే మనకు మన ఆరోగ్యం మీద అంత జాగ్రత్త ఉంది కనుక. అదే మన దగ్గర పాపాన్ని కొలిచే పరికరం ఉన్నట్లయితే (sin meter), ముందుగా మన పాపాన్ని కొలవము, కానీ వేరే వాళ్ల పాపాలను కొలుస్తాం. మన పాపాల కంటే కూడా వేరే వాళ్ల పాపాలను చూపాలంటే మనకు చాలా ఆసక్తి .

అందుకే ఏసుప్రభువు అంటారు “తీర్పు తీర్చు కుడి అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు.”

వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ని చూసినప్పుడు ఏసుప్రభువు “మీలో పాపం లేని వారు మొదట ఆమెపై రాయి వేయవచ్చు” అని.
అప్పుడు ఒక్కరు కూడా రాయి వేయలేదు. ఇతరుల తప్పులను చూపించడానికి బదులుగా మొదట మన స్వంత తప్పులను చూసుకుందాం.

ప్రార్థన:
తండ్రీ , ఇతరుల తప్పులను చూపించకుండా మొదట మా తప్పులను పరీక్షించుకునే మంచి బుద్ది మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్.

ఇతరులను విమర్శించే పనిలో మనము చాలా సమయాన్ని గడిపాము కనుక మన కొరకు మనం చాలా కొద్దిగా సమయమే మిగిలించుకొని ఉన్నాము. – చుక్ పలానిక్ చోకే.

No comments: